News March 9, 2025

IND VS NZ: హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి!

image

హైదరాబాద్‌లో ఛాంపియన్‌షిప్ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్‌లలోని LED టీవీల్లో మ్యాచ్‌ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో‌ మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.

Similar News

News February 16, 2026

KMR: నేడే కౌన్సిలర్ల ఎన్నిక.. ‘పుర’ పీఠం ఎవరికో?

image

కామారెడ్డి జిల్లాలోని పురపాలక సంఘాల్లో నేడు సందడి నెలకొననుంది. ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారంతో పాటు, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉంది. కానీ కామారెడ్డి పరిస్థితి భిన్నంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేక మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.

News February 16, 2026

అన్నమయ్య: ఉత్కంఠ.. కోర్టుకు మాజీ మంత్రి

image

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందుతుడిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరులు సోమవారం తంబళ్లపల్లె కోర్టులో హాజరు కానున్నారు. వారితో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరి కొంతమంది కూడా కోర్టుకు రానున్నారు. పలు కారణాల రీత్యా ఈనెల 2న మాజీ మంత్రి సోదరులు తంబళ్లపల్లె కోర్టులో వాయిదాకు గైర్హాజరవడంతో వారి తరఫు న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ సమర్పించిన విషయం తెలిసిందే.

News February 16, 2026

MBNR: ఆదర్శం.. రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట

image

మహబూబ్‌నగర్ జిల్లా శేరిపల్లిలో మతాచారాలు, ఆడంబరాలకు భిన్నంగా రాజ్యాంగం సాక్షిగా వివాహం జరిగింది. రిబుకా, ఉదయ్ అనే నూతన జంట రాజ్యాంగంపై ప్రమాణం చేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ వినూత్న వేడుకలో తెలంగాణ విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు, రెండు కుటుంబాల సభ్యులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఆదర్శ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.