News February 23, 2025
IND Vs PAK: ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..

ICC ఈవెంట్స్‌లో పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి. కానీ CT గణాంకాలను చూస్తే కాస్త ఆందోళన కలుగుతోంది. ఇప్పటివరకు CTలో IND, PAK ఐదుసార్లు తలపడగా పాక్ 3సార్లు గెలిచింది. 2004, 2009లో పాక్ గెలవగా 2013లో IND విజయం సాధించింది. 2017 సీజన్‌లో దాయాది జట్లు 2సార్లు ఢీకొన్నాయి. లీగ్ స్టేజ్‌లో IND గెలవగా ఫైనల్లో పాక్ మనల్ని ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని IND ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News November 14, 2025
గోపీనాథ్ ‘లీడ్ బ్రేక్’ చేసిన నవీన్

జూబ్లీహిల్స్‌లో అంచనాలకు మించి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఆయనకు 10 వేలకు అటు ఇటుగా మెజార్టీ రావచ్చని మెజార్టీ సర్వేలు చెప్పాయి. అయితే 9వ రౌండ్ ముగిసేసరికే 19వేల ఆధిక్యంలో ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో దివంగత MLA మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ రికార్డ్ విష్ణు (2009లో కాంగ్రెస్ నుంచి 21,741 లీడ్) పేరిట ఉంది.
News November 14, 2025
AcSIRలో 16 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అకాడమీ ఆఫ్ సైంటిఫిక్& ఇన్నోవేటివ్ రీసెర్చ్(<
News November 14, 2025
బీటెక్ పాసైన వారికి 250 ఉద్యోగాలు.. జీతం రూ.లక్ష!

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌లో 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్, ఎంఎస్సీతో పాటు GATE పాసైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లకు మించకూడదు. కంప్యూటర్ సైన్స్/ఐటీ, డేటా సైన్స్/ఏఐ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ తదితర విభాగాల్లో వెకెన్సీస్ ఉన్నాయి. జీతం నెలకు రూ.44,900-1,42,400. త్వరలో స్వీకరణ తేదీ వెల్లడించనున్నారు. చివరి తేదీ DEC 14.


