News December 10, 2024

రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన ఇండియా కూటమి

image

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. దీనిపై 71 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు తెలిసింది. అదానీ అంశంపై కాంగ్రెస్‌తో దూరం పాటిస్తున్న తృణమూల్, సమాజ్‌వాదీ ఎంపీలూ సంతకాలు చేశారని సమాచారం. ప్రతిపక్ష సభ్యుల పట్ల ఆయన వ్యవహార శైలి బాగాలేదన్నది ప్రధాన ఆరోపణ. సభను తటస్థ వైఖరితో నిర్వహించడం లేదని, అధికార పక్షానికే అనుకూలంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Similar News

News January 24, 2025

పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ‘వరం’

image

AP:2027లో జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు కేటాయించింది. 2071-72 ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లను పిలవగా, పుష్కరాల ప్రతిపాదనలతో వాటిని రద్దు చేసి కొత్త నిధులను కేంద్రం ఇచ్చింది.

News January 24, 2025

త్వరలో RTCలో నియామకాలు: మంత్రి

image

TGSRTCలో త్వరలో 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 3500 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కొత్త బస్సులు కొనలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని, మరో 600 బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని చెప్పారు. HYDలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.

News January 24, 2025

ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల

image

AP: మైనార్టీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల అయ్యాయి. రూ.40.22కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్‌కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.