News September 9, 2024

భారత్, పాక్ తరచూ మ్యాచ్‌లు ఆడాలి: అజ్మల్

image

భారత్, పాకిస్థాన్ జట్లు తరచూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అభిప్రాయపడ్డారు. ‘ఈ దేశాల మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతాఇంతా కాదు. ఆఖరికి చంద్రుడిపై జరిగినా ఆ మ్యాచ్‌ చూసేందుకు జనం ఎగబడతారంటే అతిశయోక్తి లేదు. ఒకరి దేశంలో మరొకరు తరచూ ఆడాలి’ అని అభిలషించారు. భారత్ చివరిగా 2008లో ఆసియా కప్‌ కోసం పాక్‌లో పర్యటించింది. ఇక 2007 తర్వాత రెండు దేశాల మధ్య టెస్టులే జరగలేదు.

Similar News

News October 11, 2024

నీటి పారుదల శాఖకు రూ.284 కోట్లు విడుదల

image

AP: జలవనరుల ప్రాజెక్టుల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం నీటిపారుదల శాఖకు రూ.284.04 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో కాలువలు, ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు వంటివి చేయనున్నారు. అంతకుముందు రూ.310 కోట్లతో ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ అంచనా వ్యయాన్ని పంపింది.

News October 11, 2024

GOOD NEWS.. వారికి బోనస్

image

కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-C ఉద్యోగులు, గ్రూప్-బి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చి 31లోపు ఉద్యోగంలో చేరిన, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలలు విధులు నిర్వహించిన వారు బోనస్‌కు అర్హులు. పనిచేసిన రోజులను బట్టి చెల్లింపులు ఉంటాయి. అర్హులైన ఉద్యోగులకు యావరేజ్‌గా రూ.6908 బోనస్ అందుతుంది. కేంద్ర పారామిలిటరీ, ఆర్మీ ఉద్యోగులూ అర్హులే.

News October 11, 2024

9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం తాగేశారు

image

TG: దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.350 కోట్ల అమ్మకాలు అదనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సారి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.