News August 10, 2024

భారత్ అత్యంత నమ్మకమైన దేశం: ముయిజ్జు

image

మాల్దీవుల నుంచి భారత్‌ జాడల్ని తరిమికొట్టాలంటూ ఒకప్పుడు పెద్ద ప్రచారాన్నే నిర్వహించిన ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన భాగస్వామి అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. ‘భారత్-మాల్దీవుల బంధం బలోపేతానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మా దేశానికి ఎప్పుడు అవసరం ఉన్నా భారత్ అండగా నిలిచింది. ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం’ అని పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

18న గవర్నర్‌తో జగన్ భేటీ

image

AP: గవర్నర్‌‌తో YCP చీఫ్ YS జగన్ భేటీ తేదీ ఖరారైంది. ఈనెల 18న ఆయన గవర్నర్‌ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలను సమర్పిస్తారు. కాగా జగన్‌కు ఈనెల 17న గవర్నర్ అపాయింట్మెంటు ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలతో దాన్ని 18కి వాయిదా వేసినట్లు తాజాగా లోక్‌భవన్ కార్యదర్శి లేఖ పంపారు. కాగా కోటి సంతకాల పత్రాలను YCP నేతలు విజయవాడకు తరలిస్తున్నారు.

News December 11, 2025

సర్పంచ్ ఎన్నికలు.. 9 ఓట్లతో గెలిచాడు

image

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. స్వల్ప ఓట్ల తేడాతో కొందరు అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండాలో బీఆర్ఎస్ బలపరిచిన జాటోత్ హరిచంద్ 9 ఓట్లతో గెలిచారు. అటు జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌ తండాలోనూ బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత 12 ఓట్లతో విజయం సాధించారు.

News December 11, 2025

ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై కమిటీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై ప్రభుత్వం ఏడుగురితో కమిటీని ఏర్పాటుచేసింది. ఈమేరకు GO880 విడుదల చేసింది. CS నేతృత్వంలో GAD, ఫైనాన్స్, హెల్త్ సెక్రటరీలు, AP గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ల ప్రెసిడెంట్లు సభ్యులుగా, NTR వైద్యసేవా ట్రస్టు CEO కన్వీనర్‌గా ఉన్నారు. కాగా 8 వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఈ కమిటీకి కాలపరిమితిని నిర్దేశించింది.