News March 27, 2024
ఫిలిప్పీన్స్‌కు భారత్ అండ, చైనా ఆగ్రహం

ఫిలిప్పీన్స్ సౌర్వభౌమత్వానికి అండగా నిలుస్తామని భారత్ ఆ దేశానికి హామీ ఇచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ ప్రాదేశిక జలాలను కూడా చైనా తమవేనంటూ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ హామీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరోవైపు చైనా భారత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌత్ చైనా సీలో తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని తేల్చిచెప్పింది. ఆ విషయంలో మూడో దేశపు జోక్యం సరికాదని హితవుపలికింది.
Similar News
News February 7, 2026
6 గంటలు క్యాబ్ సర్వీసులు బంద్

ఇవాళ ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ యాప్ డ్రైవర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. 6AM-12PM వరకు సమ్మె కొనసాగనుంది. దీంతో HYD, విజయవాడ సహా ఇతర ప్రధాన నగరాల్లో కారు, ఆటో, బైక్ టాక్సీ సేవలు నిలిచిపోనున్నాయి. ఛార్జీల దోపిడీ(మినిమం ఫేర్)పై నియంత్రణ, ప్రైవేట్ వాహనాల(వైట్ ప్లేట్) వాడకంపై నిషేధం, సామాజిక భద్రత వంటి డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి.
News February 7, 2026
9th విద్యార్థులకు మార్చిలోనే టెన్త్ పాఠాలు

AP: వచ్చే విద్యాసంవత్సరంలో 6-8 క్లాసుల సిలబస్, ఆ తర్వాతి ఏడాది 9,10 తరగతుల పాఠ్యాంశాలు మారతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా జూన్‌లో టీచర్లకు శిక్షణకు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి స్టూడెంట్లకు టెన్త్ పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టిపెట్టాలని ఆదేశించింది.
News February 7, 2026
సకల దోష నివారణ మార్గం ‘సూర్య గ్రహ శాంతి’

జాతకంలో సూర్య దోషాలు ఉన్నవారు, సూర్య మహాదశ నడుస్తున్న వారు భాను సప్తమి నాడు సూర్య గ్రహ శాంతి పూజ, యజ్ఞం నిర్వహించడం శుభప్రదం. సూర్యుడు జాతకంలో ఆత్మకారకుడు, అధికారానికి చిహ్నం. ఈ రోజున చేసే జపం, హోమం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగి, సమాజంలో గౌరవం, వృత్తిలో విజయం లభిస్తాయి. ఈ హోమంలో పాల్గొనడం ద్వారా జాతకంలోని రవి నీచ స్థితి, గ్రహణ దోషాలు హరించుకుపోతాయి. జీవితంలో కొత్త వెలుగులు నిండుతాయి.


