News August 12, 2025

భారత్ ఎవరికీ తలవంచదు: చంద్రబాబు

image

AP: పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శక్తిమంతంగా ఎదుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ ఎవరికీ తల వంచదని, దేశం జోలికి ఎవరొచ్చినా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. విజయవాడలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘టారిఫ్స్ విధిస్తే భారత్ ఆగిపోతుందనుకోవడం భ్రమే. మనకు ఉద్యోగాలు ఇవ్వని దేశాల్లోనే అభివృద్ధి నిలిచిపోతుంది. ఇప్పుడు ఉన్నది పవర్ ఫుల్ ఇండియా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News August 12, 2025

భారత్ సరిహద్దు సమీపంలో చైనా రైల్వే లైన్!

image

ఇండియా సరిహద్దు సమీపంలో చైనా రైల్వేలైన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో కొంత భాగం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) సమీపంలో ఉంటుందని చెప్తున్నారు. టిబెట్‌ను షిన్‌జాంగ్ ప్రావిన్సుతో కలపనున్నారు. రూ.1.15 లక్షల కోట్ల క్యాపిటల్‌తో ‘ది షిన్‌జాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేశారని చైనా మీడియాలో వార్తలొచ్చాయి. LAC సమీపంలో కాబట్టి రక్షణపరంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరముంది.

News August 12, 2025

చెప్పే కథ ఒకటి.. తీసేది ఇంకొకటి: అనుపమ

image

తాము ఓకే చేసిన స్క్రిప్టు మూవీ పూర్తయ్యేలోగా మారిపోతూ ఉంటుందని హీరోయిన్ అనుపమ పేర్కొన్నారు. ‘పరదా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కథ మాత్రమే కాదు పాత్రల విషయంలోనూ ఇలాంటి మార్పులు ఉంటూనే ఉంటాయి. అవన్నీ తెలియక ప్రేక్షకులు ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేస్తారు? అని ప్రశ్నిస్తూ ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. ‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రం గురించే ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.

News August 12, 2025

టెంపో ప్రమాదంలో.. 10కి చేరిన మృతుల సంఖ్య

image

మహారాష్ట్ర పుణే జిల్లా మహాలుంగేలో <<17371241>>టెంపో<<>> లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 40 మంది ఉన్నారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శ్రావణ సోమవారం సందర్భంగా వీరంతా కుందేశ్వర్‌ ఆలయ సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.