News May 7, 2025

లండన్‌లో భారత సంతతి నిరసనకారుల అరెస్టు

image

పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా లండన్‌లోని పాక్ హైకమిషన్ వద్ద భారతీయులు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సమాజం పాక్‌ విషయంలో స్పందించాలని, ఉగ్రవాదంపై నిలదీయాలని వారు డిమాండ్ చేశారు. ఆ ధర్నాను లండన్ పోలీసులు తాజాగా భగ్నం చేశారు. భారత సంతతి నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు.

Similar News

News February 7, 2026

6 గంటలు క్యాబ్ సర్వీసులు బంద్

image

ఇవాళ ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ యాప్ డ్రైవర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. 6AM-12PM వరకు సమ్మె కొనసాగనుంది. దీంతో HYD, విజయవాడ సహా ఇతర ప్రధాన నగరాల్లో కారు, ఆటో, బైక్ టాక్సీ సేవలు నిలిచిపోనున్నాయి. ఛార్జీల దోపిడీ(మినిమం ఫేర్)పై నియంత్రణ, ప్రైవేట్ వాహనాల(వైట్ ప్లేట్) వాడకంపై నిషేధం, సామాజిక భద్రత వంటి డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి.

News February 7, 2026

9th విద్యార్థులకు మార్చిలోనే టెన్త్ పాఠాలు

image

AP: వచ్చే విద్యాసంవత్సరంలో 6-8 క్లాసుల సిలబస్, ఆ తర్వాతి ఏడాది 9,10 తరగతుల పాఠ్యాంశాలు మారతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా జూన్‌లో టీచర్లకు శిక్షణకు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి స్టూడెంట్లకు టెన్త్ పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టిపెట్టాలని ఆదేశించింది.

News February 7, 2026

సకల దోష నివారణ మార్గం ‘సూర్య గ్రహ శాంతి’

image

జాతకంలో సూర్య దోషాలు ఉన్నవారు, సూర్య మహాదశ నడుస్తున్న వారు భాను సప్తమి నాడు సూర్య గ్రహ శాంతి పూజ, యజ్ఞం నిర్వహించడం శుభప్రదం. సూర్యుడు జాతకంలో ఆత్మకారకుడు, అధికారానికి చిహ్నం. ఈ రోజున చేసే జపం, హోమం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగి, సమాజంలో గౌరవం, వృత్తిలో విజయం లభిస్తాయి. ఈ హోమంలో పాల్గొనడం ద్వారా జాతకంలోని రవి నీచ స్థితి, గ్రహణ దోషాలు హరించుకుపోతాయి. జీవితంలో కొత్త వెలుగులు నిండుతాయి.