News November 23, 2024

38 ఏళ్ల తర్వాత భారత ఓపెనింగ్ జోడీ అదుర్స్

image

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత ఓపెనర్లు జైస్వాల్(90*), కేఎల్ రాహుల్(62*) రికార్డు సృష్టించారు. AUS గడ్డపై 20 ఏళ్ల తర్వాత ఓపెనింగ్ సెంచరీ(172*) భాగస్వామ్యం నమోదు చేశారు. 2004లో సెహ్వాగ్-ఆకాశ్ చోప్రా 123 రన్స్ చేశారు. అలాగే ఆ దేశంలో 38 ఏళ్ల తర్వాత 150కి పైగా పరుగులు చేసిన భారత ఓపెనింగ్ జోడీగా జైస్వాల్, రాహుల్ నిలిచారు. చివరగా 1986లో గవాస్కర్-శ్రీకాంత్ జోడీ 191 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నమోదుచేసింది.

Similar News

News December 8, 2024

నిద్ర పోయేటప్పుడు ఇలా చేస్తున్నారా?

image

పడుకునే సమయంలో చాలా మంది దోమల బెడదను తప్పించుకునేందుకు దోమల నివారణ యంత్రాలను వాడుతారు. వీటిని వాడటం వల్ల హానికరమైన రసాయనాలు వెలువడుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. దీంతో శ్వాస, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇవి కాస్త క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కర్పూరం పొగ, వేపాకులను కాల్చడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

News December 8, 2024

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు

image

AP: భారీ వర్షాలతో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జేసీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోత కోసిన వరిని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. కోత కోసిన వరిని రక్షించేందుకు టార్పాలిన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వర్షాలు పడే సమయంలో పంట కోత కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

News December 8, 2024

రాముడే సిగ్గుతో త‌ల‌దించుకుంటాడు: ఇల్తిజా

image

రాముడి పేరు నిన‌దించలేద‌న్న కార‌ణంతో ముస్లిం యువ‌కుల‌ను హింసించ‌డం లాంటి ఘ‌ట‌న‌ల‌తో రాముడే సిగ్గుతో త‌ల‌దించుకుంటాడ‌ని PDP నాయ‌కురాలు ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జరిగిన ఈ ఘ‌ట‌న‌పై ఆమె స్పందిస్తూ ఇలాంటి స‌మ‌యాల్లో రాముడు సైతం నిస్స‌హాయంగా ఉండిపోతార‌ని పేర్కొన్నారు. దేవుడి పేరును చెడ‌గొడుతూ ల‌క్ష‌లాది మంది భార‌తీయుల‌ను ప‌ట్టిపీడిస్తున్న రోగం హిందుత్వమని అన్నారు.