News October 6, 2024

INDvsBAN: భారత్ టార్గెట్ 128 రన్స్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది. ఆ జట్టులో మిరాజ్ (35), షాంటో(27) మాత్రమే పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్ 3 వికెట్లతో బంగ్లా నడ్డి విరిచారు. పాండ్య, మయాంక్ యాదవ్, సుందర్ ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 128 రన్స్ చేయాలి.

Similar News

News December 16, 2025

ప్రముఖ నటుడిని చంపింది కొడుకే?

image

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబ్ రైనర్(78), ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్(68)లను వారి కుమారుడు నిక్ రైనర్ <<18569745>>హత్య<<>> చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిక్ కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసై పేరెంట్స్‌తో కాకుండా గెస్ట్‌హౌజ్‌లో ఉంటున్నాడు. హత్యకు ముందు కూడా హాలిడే పార్టీలో రాబ్‌తో నిక్ గొడవపడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన హాలీవుడ్‌లో విషాదం నింపింది.

News December 16, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,520 తగ్గి రూ.1,33,860కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,400 పతనమై రూ.1,22,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,11,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 16, 2025

EVMలతోనే 4 సార్లు గెలిచా: సుప్రియా సూలే

image

EVMలపై ప్రతిపక్షాలు రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్న వేళ NCP(SP) ఎంపీ సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటితోనే తాను 4 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యానని, అందుకే ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు. LSలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. EVMలు, VVPATలను ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు EVMలను దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని హోంమంత్రి అమిత్‌ షా గుర్తుచేశారు.