News August 21, 2025

రూ.904 కోట్లతో అమరావతిలో మౌలిక వసతులు

image

AP: అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని క్యాబినెట్‌లో నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు, అదానీ సోలార్ ఎనర్జీకి 200 ఎకరాల కేటాయింపుకు, ఏపీ యాచక నిరోధక చట్టసవరణ ముసాయిదా బిల్లుకు, తోట వెంకటాచలం(కాకినాడ) లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వ అభివృద్ధి పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.

Similar News

News January 15, 2026

ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: మోదీ

image

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా వైభవంగా జరుపుకొనే ఈ వేడుక అందరి హృదయాల్లో ఆనందాన్ని, కృతజ్ఞతా భావాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉండే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలో సుఖ శాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

News January 15, 2026

173 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 15, 2026

APPLY NOW: NALCOలో 110 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

image

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<>NALCO<<>>)లో 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/బీఈ(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) అర్హత గలవారు జనవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://mudira.nalcoindia.co.in