News February 7, 2025

KTRకు అంతర్జాతీయ ఆహ్వానం

image

TG: మాజీ మంత్రి KTRకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. IBC-2025 సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించాలని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. పదేళ్ల BRS పాలనలో దిగ్గజ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడం అద్భుతమని ప్రశంసించింది. HYDను యువతకు ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని, తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి స్ఫూర్తిదాయకమని అభినందించింది.

Similar News

News February 16, 2026

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రేపు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జిల్లాలో సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.

News February 16, 2026

వంటింటి చిట్కాలు మీకోసం

image

* బొంబాయి రవ్వ ఉప్మా ఉండలు కట్టకుండా పొడిపొడిగా రావాలంటే రవ్వకు రెండు చెంచాల నూనె కలపండి. * క్యాబేజీ వండేటప్పుడు అందులో చెంచా నిమ్మరసం కలిపితే కూర వాసన రాకుండా ఉంటుంది. * వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది. క్యాబేజీ కూర వండేప్పుడు అందులో కొద్దిగా నిమ్మ ఉప్పు వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది. * మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే కేకు మరింత రుచిగా వస్తుంది.

News February 16, 2026

అక్కడ BRS+BJP.. ఇక్కడ BRS+కాంగ్రెస్

image

TG: కామారెడ్డి మున్సిపాలిటీలో BJPకి చెక్ పెట్టేందుకు INC, BRS ఒక్కటయ్యాయి. ఇక్కడ INC-19, BJP-16, BRS-11, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో INC, BRS పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం. మళ్లీ INCలో చేరిన రెబల్ అభ్యర్థి ఉమారాణి‌కే ఛైర్ పర్సన్ పదవి ఇచ్చేందుకు 2 పార్టీలు అంగీకరించాయి. BRSకు వైస్ ఛైర్మన్(కాసర్ల గోదావరి) పదవి దక్కనుంది. అటు అమరచింతలో BRS-BJP ఒక్కటయ్యాయి.