News June 19, 2024
జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా
హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. గతంలో సీఎంగా ఉండటంతో విచారణలో వాయిదాలు కోరుతూ వచ్చిన జగన్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News September 12, 2024
నూడిల్స్ తింటున్నారా?
నూడిల్స్‌ను తినడం మానుకోవడం మంచిదని ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రమోటర్ బార్బరా ఓ’నీల్ తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు ఈ ఆహారం అందించడాన్ని ఆపేయాలని హెచ్చరించారు. నూడుల్స్‌లో పోషకాలు శూన్యమని, గోధుమ, సింథటిక్ & MSG, కార్సినోజెనిక్ ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటుందని చెప్పారు. నూడుల్స్ తినడం వల్ల జీర్ణాశయంలో మంటగా ఉంటుందని, క్రమంగా రుచిని గుర్తించే స్వభావం తగ్గుతుందన్నారు.
News September 12, 2024
కాబోయే భర్తకు రూ.30 లక్షల జీతం ఉండాలి.. డివోర్స్‌డ్ మహిళ పోస్ట్!
నాగ్‌పూర్‌కు చెందిన డివోర్స్‌డ్ మహిళ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చేసిన ఓ ప్రకటన వైరలవుతోంది. ‘నాకు 39 ఏళ్లు. ఏడాదికి రూ.1.3లక్షలు సంపాదిస్తా. కాబోయే భాగస్వామి అవివాహితుడై ఉండాలి. ఏడాదికి రూ.30 లక్షల జీతం రావాలి. 3BHK ఫ్లాట్ ఉండాలి. నాతోపాటే నా తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇంటి పనుల కోసం పనిమనిషిని ఉంచాలి. అత్తామామలతో ఉండలేను. వరల్డ్ టూర్‌కు తీసుకెళ్లాలి’ అని ప్రకటనలో ఉంది.
News September 12, 2024
స్టాక్ మార్కెట్ల జోష్‌కు కారణాలివే
* US CPI డేటా అంచనాలను మించి మెరుగ్గా ఉండటం * US ఫెడ్ వడ్డీరేట్లను 200 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తుందన్న అంచనాలు * 2026 ఆగస్టు నాటికి ఆర్బీఐ రెపోరేటును 4 సార్లు తగ్గిస్తుందన్న అంచనాలు * క్రూడాయిల్ ధరలు మూడేళ్ల కనిష్ఠానికి చేరడం, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ సగటు ధర 70 డాలర్లే * బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్, ఆటో, మెటల్ షేర్లలో ర్యాలీ * బూస్ట్ ఇచ్చిన FIIలు, పాజిటివ్ సెంటిమెంట్ * డాలర్ సూచీ బలహీనత