News August 13, 2025

ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు IOA ఆమోదం

image

2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ బిడ్డింగ్‌కు భారత ఒలింపిక్ సంఘం(IOA) ఆమోదం తెలిపింది. అవకాశం వస్తే అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించాలని భారత్ యోచిస్తోంది. కాగా బిడ్డింగ్ దాఖలుకు ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది. ఇదే సమయంలో నిర్వహణ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు కెనడా తాజాగా ప్రకటించడంతో భారత్‌కు అవకాశాలు మెరుగుపడ్డాయి.

Similar News

News March 13, 2026

BREAKING: తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.980 తగ్గి రూ.1,61,240కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.900 పడిపోయి రూ.1,47,800 పలుకుతోంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 13, 2026

అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.6వేలు

image

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.6వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కృష్ణా(D) గన్నవరంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.

News March 13, 2026

అన్నదాతా సుఖీభవ-అర్హత ఇలా తెలుసుకోవచ్చు

image

ఆన్‌లైన్‌లో annadathasukhibhava.ap.gov.in/ ద్వారా రైతులు తమ అర్హతను తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న పోర్టల్‌కి వెళ్లి Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత searchపై క్లిక్ చేస్తే.. మీ పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకానికి అర్హులైతే స్టేటస్ దగ్గర Eligile అని వస్తుంది. ఒకవేళ కాకుంటే Remarks దగ్గర అందుకు గల కారణాలు వస్తాయి.