News April 11, 2024

ఐపీఎల్: సంజూ శాంసన్ ఖాతాలో మరో రికార్డు

image

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ రికార్డు సృష్టించారు. RR తరఫున అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. సంజూ ఇప్పటివరకు 25 సార్లు 50+ స్కోర్లు చేయగా, అతని తర్వాత స్థానంలో బట్లర్ (24) ఉన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచులాడిన సంజూ 246 రన్స్ చేశారు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న అతడిని T20 WC జట్టుకు సెలెక్ట్ చేయాలని బీసీసీఐ సెలక్టర్లకు పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

Similar News

News December 17, 2025

రియల్ లైఫ్ ‘జెర్సీ’ మూమెంట్!

image

మన కెరీర్ క్లోజ్ అనుకున్నప్పుడు లైఫ్ మరో ఛాన్స్ ఇస్తే ఆ ఫీలింగ్‌‌ను ‘జెర్సీ రైల్వే స్టేషన్ సీన్’ కంటే బాగా ఏదీ చెప్పలేదేమో. తాజా IPL వేలంలో అదే రిపీటైంది. యంగేజ్‌లోనే సచిన్, సెహ్వాగ్, లారాల కాంబోగా గుర్తింపు పొందిన <<18585528>>పృథ్వీ‌షా<<>> ఆ తర్వాత వివాదాలు&ఫామ్ లేక కనుమరుగయ్యారు. టన్నుల కొద్ది డొమెస్టిక్‌ రన్స్ కొట్టినా సర్ఫరాజ్‌‌కు స్థానం దొరకలేదు. రీఎంట్రీ కష్టమనుకున్న సమయంలో వీరిని DC, CSK ఆదుకున్నాయి.

News December 17, 2025

ఆయిల్ పామ్ తోటల్లో నత్రజని లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.

News December 17, 2025

CBFC ‘NO’.. IFFKలో రిలీజ్: CM విజయన్

image

సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వని సినిమాలను ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్- కేరళ’ (DEC12-19)లో రిలీజ్ చేస్తామని CM పినరయి విజయన్ ప్రకటించారు. ప్రశ్నించే గొంతులను అణచివేసే కేంద్ర నియంతృత్వ ప్రయత్నాలను కేరళ అంగీకరించదని Fbలో స్పష్టం చేశారు. అయితే CBFC నో చెప్పిన 19 మూవీల్లో 4 స్క్రీనింగ్‌కు I&B మినిస్ట్రీ అనుమతిచ్చింది. ప్రదర్శనకు 2 వారాల ముందు లిస్ట్ ఇవ్వనందుకే మిగతా వాటికి పర్మిషన్ లేదని పేర్కొంది.