News April 30, 2024

IPL: ముంబై గెలుపు బాట పట్టేనా?

image

IPL 2024లో భాగంగా ఇవాళ లక్నో, ముంబై మధ్య సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు నాలుగు మ్యాచులు జరగ్గా.. LSG ఖాతాలో 3 విజయాలు, ముంబై ఖాతాలో ఒక విజయం ఉంది. ఈ సీజన్‌లో ముంబై గత రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచుతోనైనా పాండ్య సేన విజయాల బాట పడుతుందా.. లేదా రాహుల్ ఆర్మీ ప్లేఆఫ్‌కు మరింత చేరువవుతుందా వేచి చూడాలి.

Similar News

News December 11, 2025

ఓటమిని తట్టుకోలేక పురుగు మందు తాగింది..

image

TG: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాహైమద్‌పల్లిలో సర్పంచ్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి లక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News December 11, 2025

బంగ్లాదేశ్‌కు చైనా ఫైటర్ జెట్లు.. భారత్‌కు ముప్పు?

image

బంగ్లాదేశ్‌కు 20 అత్యాధునిక J-10C ఫైటర్ జెట్లను సప్లై చేసేందుకు 2.2 బిలియన్ డాలర్ల డీల్‌కు చైనా అంగీకరించింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యూనుస్ చైనా నుంచి సబ్‌మెరైన్లు, ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో భారత్‌కు బంగ్లా నుంచి ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇస్తుండడంతో భారత్‌-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

News December 11, 2025

చలి పంజా.. బయటికి రావద్దు!

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. TGలో ఇవాళ రాత్రికి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోతాయని TG వెదర్‌మ్యాన్ తెలిపారు. HYD సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుందన్నారు. ఉమ్మడి ADB, NZB, WGL, MDK జిల్లాలకు IMD రేపటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఆంధ్రాలో ఈ వారమంతా చలిగాలులు కొనసాగుతాయని AP వెదర్‌మ్యాన్ తెలిపారు. అరకు, వంజంగి, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలకు పడిపోయాయి.