News April 25, 2024
IPL: గుజరాత్‌పై ఢిల్లీ విజయం

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ 4 రన్స్ తేడాతో విజయం సాధించింది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 220 పరుగులకు పరిమితమైంది. GT బ్యాటర్లలో సాయి సుదర్శన్ 65, మిల్లర్ 55, సాహా 39 రన్స్ చేశారు. ఢిల్లీ బౌలర్లలో రసిక్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీయగా, నోకియా, ముకేశ్, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్‌లో GTకి ఇది ఐదో ఓటమి కాగా, ఢిల్లీకి నాలుగో విజయం.
Similar News
News April 16, 2026
ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)
News April 16, 2026
IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.