News April 11, 2024

IPL.. మిగతా జట్లకు గిల్ వార్నింగ్

image

తాము బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని ఇతర జట్లు గుర్తు పెట్టుకోవాలని గుజరాత్ కెప్టెన్ గిల్ హెచ్చరించారు. ‘లక్ష్యమెంతైనా చివరి వరకు పోరాడుతాం. ప్రత్యర్థులు GTని తేలిగ్గా తీసుకోవద్దు. నిన్నటి మ్యాచ్‌లో 3 ఓవర్లలో 45 రన్స్ చేయడం కష్టమేమీ కాదు. ఇద్దరు బ్యాటర్లు 9 బంతుల్లో 22 రన్స్ చేయాలి. ఓవర్‌లో 2 లేదా 3 బంతులను ఎటాక్ చేస్తే చాలు. రషీద్ ఖాన్, తెవాటియా అదే చేశారు’ అని కొనియాడారు.

Similar News

News December 11, 2025

SHOCKING: వీర్యదాత వల్ల 197 మందికి క్యాన్సర్ ప్రమాదం

image

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే TP53 జన్యు మ్యుటేషన్ ఉన్న విషయం తెలియని వ్యక్తి దానం చేసిన వీర్యం ద్వారా యూరప్‌లో 197 మంది పిల్లలు పుట్టారు. 2005 నుంచి అతను వీర్యదాతగా ఉన్నారు. ఈ వీర్యాన్ని సరఫరా చేసిన డెన్మార్క్‌కు చెందిన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ బాధిత కుటుంబాలకు తాజాగా సారీ చెప్పింది. ఈ పిల్లల్లో కొందరు ఇప్పటికే క్యాన్సర్‌తో మరణించారు. మిగతావారికీ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని వైద్యులు తెలిపారు.

News December 11, 2025

టాస్ గెలిచిన భారత్

image

ముల్లాన్‌పూర్ వేదికగా రెండో టీ20లో భారత్-సౌత్ ఆఫ్రికా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
IND ప్లేయింగ్ XI: అభిషేక్, గిల్, సూర్యకుమార్ యాదవ్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, దూబే, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి
SA ప్లేయింగ్ XI: రీజా, డికాక్, మార్క్రమ్(C), బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, లిండే, జాన్సెన్, సిపామ్లా, లుంగి ఎంగిడి, బార్ట్‌మన్

News December 11, 2025

నచ్చినవి తింటూనే తగ్గొచ్చు

image

శీతాకాలం వస్తే చాలు ఒంటికి ఎక్కడలేని బద్ధకం వస్తుంది. వ్యాయామం పక్కన పెట్టడంతో బరువు పెరిగిపోతారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. కండరాల నిర్మాణం, బలం కోసం ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా చికెన్, సీ ఫుడ్, ఎగ్స్, సోయా, నట్స్, సీడ్స్ వంటి లీన్ ప్రోటీన్ ఫుడ్స్ తినాలి. క్యారెట్లు, ముల్లంగి, బీట్రూట్, ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి.