News March 25, 2024

IPL: ముంబై ఓటమి.. రోహిత్ ఫ్యాన్స్ సంబరాలు

image

నిన్న GTపై ముంబై ఓడిపోవడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 5 టైటిల్స్ అందించిన సారథిని పక్కనబెట్టినందుకు ముంబైకి ఇలాగే జరగాలని పోస్టులు చేస్తున్నారు. ‘రోహిత్ శర్మ రన్స్ చేయాలి, ముంబై ఓడిపోవాలి’ అనేదే తమ నినాదం అని చెబుతున్నారు. నిన్నటి మ్యాచులో రోహిత్ 43 రన్స్ చేశారు. మరి రోహిత్ శర్మ ఫ్యాన్స్ అభిప్రాయంపై మీ కామెంట్?

Similar News

News December 12, 2025

3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

image

PM మోదీ ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు PM ముందుగా ఆ దేశానికి వెళ్తారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ భేటీ కీలకం కానుంది. అక్కడి నుంచి ఇథియోపియా వెళ్తారు. ఆ దేశానికి ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశంలో చర్చల అనంతరం ఒమన్ చేరుకొని తిరుగు పయనమవుతారు.

News December 12, 2025

4 కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన: CM రేవంత్

image

TG: ఫుట్‌బాల్ తనకు ఇష్టమైన ఆట అని CM రేవంత్ తెలిపారు. ‘టీం స్పిరిట్‌ను ప్రదర్శించాల్సిన క్రీడ ఇది. TG టీంకు లీడర్‌గా 4కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన. సంగారెడ్డి(D) సదాశివపేట్ కంకోల్‌లోని వోక్సెన్ వర్సిటీ సందర్శన వేళ విద్యార్థులతో కాసేపు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశా’ అని ట్వీట్ చేసి ఫొటోలను షేర్ చేశారు. రేపు ఉప్పల్‌లో మెస్సీ టీంతో రేవంత్ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.

News December 12, 2025

PHOTO VIRAL: వరల్డ్ కప్ హీరోస్

image

టీమ్‌ఇండియా-సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో జరిగిన ఓ సీన్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముల్లాన్‌పూర్ మైదానంలో తన పేరుతో స్టాండ్ ఓపెనింగ్‌ ఉండటంతో యువరాజ్ సింగ్ మ్యాచుకు వచ్చారు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తోనూ కాసేపు సరదాగా గడిపారు. ‘2007, 2011 వరల్డ్ కప్ హీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్’ అంటూ వీళ్లిద్దరి ఫొటోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.