News April 2, 2024

IPL: ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరివంటే..

image

ఐపీఎల్‌లో 14 మ్యాచులు పూర్తయ్యాయి. 3 మ్యాచుల్లో 181 పరుగులతో RCB బ్యాటర్ కోహ్లీ, RR ప్లేయర్ పరాగ్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ 167 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ వేటలో ఉన్నారు. ఇక బౌలర్లలో సీఎస్కే బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 7 వికెట్లతో టాప్‌లో ఉండగా.. ఆర్ఆర్ స్పిన్నర్ చాహల్ 6 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

Similar News

News February 10, 2026

కొడంగల్‌కు సీఎం రేవంత్

image

TG: CM రేవంత్ రేపు కొడంగల్‌లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30గం.కు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం HYDకు తిరిగి పయనమవుతారు. రేపు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 8,203 కేంద్రాలు, 16,301 బ్యాలెట్ బాక్సులను EC సిద్ధం చేసింది. మొత్తం 12,930మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

News February 10, 2026

రైతులకు వాట్సాప్‌లో APMIP సేవలు

image

AP: వాట్సాప్‌(మన మిత్ర)లో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(APMIP)ను ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘రైతులు ఫోన్‌తో 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని పంపి, APMIPను ఎంపిక చేసుకోవాలి. సబ్సిడీ కోసం నమోదు, దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం వంటి సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు ఆన్‌లైన్‌లో కొని సురక్షితంగా చెల్లింపులు చేయొచ్చు’ అని తెలిపారు.

News February 10, 2026

US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

image

H-1B వీసా ప్రోగ్రామ్‌ రద్దు చేసే బిల్లును రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమెరికాలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అమెరికన్ల కంటే విదేశీ కార్మికులకు కార్పొరేట్లు ప్రాధాన్యం ఇస్తుండటం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని వాపోయారు. కాగా H1B వీసా పొందుతున్నవారిలో 80 శాతం మంది భారత్, చైనాకు చెందిన వారే ఉండటం గమనార్హం.