News April 13, 2024

IPL: రాజస్థాన్ విజయం

image

ఐపీఎల్‌లో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ గెలిచింది. 148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఛేదనలో చెమటోడ్చింది. ఆఖర్లో హెట్మెయిర్ 10 బంతుల్లో 27 పరుగులతో మెరుపులు మెరిపించడంతో గట్టెక్కింది. ఆర్ఆర్ బ్యాటర్లలో యశస్వి(39) రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో రబాడ, కరన్ చెరో 2 వికెట్లు, అర్షదీప్, లివింగ్‌స్టన్, హర్షల్ తలో వికెట్ తీశారు. రాజస్థాన్‌కు ఇది ఐదో విజయం కావడం విశేషం.

Similar News

News December 9, 2025

ICSILలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

image

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL)లో 6 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి డిసెంబర్ 9 ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in

News December 9, 2025

ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలకు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు

image

దేశంలోని మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేసి ఎయిర్‌లైన్ ఫంక్షనింగ్, ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై సహా మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించనున్నారు.

News December 9, 2025

విజయ్‌ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

image

కరూర్ తొక్కిసలాట తర్వాత TVK చీఫ్‌, నటుడు విజయ్ తొలిసారి ప్రజల మధ్యకు వస్తున్నారు. నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాలంలోని ఎక్స్‌పో గ్రౌండ్‌లో అధికారులు భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడు శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా గుర్తించారు.