News April 20, 2024
IPL: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉండాలా.. వద్దా..? (2/2)

ఈక్రమంలో రెండు నష్టాలున్నాయి. ఆల్‌రౌండర్లతో జట్లు బౌలింగ్ వేయించడం లేదు. దీంతో నితీశ్ రెడ్డి, దూబే వంటి భారత ఆల్‌రౌండర్ల స్కిల్ మరుగున పడుతోంది. ఇక మరోవైపు బ్యాటింగ్ డెప్త్ పెరగడంతో జట్లు నిర్భయంగా ఆడుతున్నాయి. ఈ సీజన్లోనే జట్ల స్కోర్లు 4సార్లు 250ను దాటడం పరిస్థితికి అద్దం పడుతోంది. మాజీ కోచ్‌లు, రోహిత్ వంటి ఆటగాళ్లు సైతం ఈ రూల్‌ను తొలగించాలని అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.
Similar News
News December 15, 2025
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

<
News December 15, 2025
టమాటా కాయ ఆకృతి కోల్పోవడానికి కారణం ఏమిటి?

టమాటా కాయలు ఆకృతిని కోల్పోయే సమస్య ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది. పిందె కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కాయ ఆకృతి కోల్పోతుంది. పెద్ద పరిమాణం గల కాయరకాల్లో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. దీని నివారణకు కలుపు మందులు లేదా పెరుగుదలను నియంత్రించే రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. టమాట పంటను మురుగు నీరు బయటకు పోయే వసతి లేని నేలల్లో పండించకూడదు.
News December 15, 2025
పెరగనున్న టీవీల ధరలు!

కొత్త ఏడాదిలో TVల ధరలు పెరిగే అవకాశం ఉంది. మెమొరీ చిప్‌ల కొరత, రూపాయి పతనం, దిగుమతి వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో జనవరిలో 3 నుంచి 10% వరకు టీవీల ధరలు పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని తయారీ కంపెనీలు డీలర్లకు ఈ విషయం తెలియజేశాయని పేర్కొంటున్నాయి. గత మూడేళ్లలో మెమొరీ చిప్‌ల ధరలు 500% ఎగిశాయని, వచ్చే 6 నెలలూ పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.


