News April 20, 2024

IPL.. చరిత్ర తిరగరాసిన SRH

image

IPL చరిత్రలో SRH అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. IPL చరిత్రలో 250+ స్కోరు 3 సార్లు చేసిన ఏకైక జట్టుగా నిలిచింది. గతంలో RCB 2 సార్లు ఈ ఘనతను సాధించగా.. ఇవాళ్టి మ్యాచ్‌లో 266/7 రన్స్ చేయడం ద్వారా RCB రికార్డును హైదరాబాద్ టీమ్ బ్రేక్ చేసింది. ఈ సీజన్‌లోనే SRH 287/3(RCB), 277/3(MI), 266/7(DC) మూడు సార్లు 250+ స్కోరు సాధించింది.

Similar News

News December 17, 2025

బుధ ప్రదోష పూజా విధానం

image

ప్రదోష పూజను సాయంత్రం చేయాలి. అప్పటి వరకు ఉపవాసం ఉండాలి. ప్రదోష వేళలో పూజా గదిలో శివలింగాన్ని లేదా శివపార్వతుల చిత్రపటాన్ని పూజించాలి. శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు, పూలు, పండ్లు సమర్పించడం తప్పనిసరి. ప్రశాంత మనస్సుతో ‘ఓం నమః శివాయ’ అని జపించాలి. శివ అష్టోత్తరం చదివి, హారతి ఇచ్చి, నైవేద్యం పంచి ఉపవాసం విరమించాలి. బుధ ప్రదోషం బుద్ధి, వ్యాపారంలో విజయాన్నిస్తుంది.

News December 17, 2025

సన్‌రైజర్స్.. ఈసారి 300 పక్కానా!

image

IPLలో విధ్వంసకర జట్టుగా పేరొందిన SRH మరింత బలంగా మారింది. నిన్నటి మినీ వేలంలో హిట్టర్లు లివింగ్‌స్టోన్‌, కార్స్, జాక్ ఎడ్వర్డ్స్‌ను కొనుగోలు చేసింది. ఇప్పటికే అభిషేక్, హెడ్, క్లాసెన్‌, ఇషాన్‌తో టాప్ ఆర్డర్‌ శత్రుదుర్భేద్యంగా ఉంది. లివింగ్‌స్టోన్‌, కార్స్, ఎడ్వర్డ్స్‌, నితీశ్ రెడ్డితో మిడిల్ ఆర్డర్ పటిష్ఠమైంది. దీంతో గత IPLలో మిస్సైన 300 స్కోర్ ఈసారి పక్కా అని SRH ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News December 17, 2025

మామిడి లేత పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

మామిడిలో పంట పూత మొగ్గ, లేత పూత దశలో తేనె మంచు పురుగులు మరియు బూడిద తెగులు ఆశిస్తాయి. ఇవి పంటకు నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ లేదా బ్యూప్రోఫెజిన్ 2 మి.లీతో పాటు వెట్టబుల్ సల్ఫర్ 3 గ్రా లేదా మైక్లోబుటానిల్ 1గ్రా మరియు 20 శాతం బోరాన్‌ను (లీటరు నీటికి 1 నుంచి 2 గ్రాములు) కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.