News April 1, 2024

ఏప్రిల్ 16న IPL టీమ్ ఓనర్ల సమావేశం

image

ఐపీఎల్ సీజన్-18 మెగా వేలానికి బీసీసీఐ, ఐపీఎల్ పాల‌క మండలి కసరత్తు ప్రారంభించాయి. అందుకు సన్నాహక సమావేశాన్ని ఏప్రిల్ 16న అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీల ఓనర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వేలం విధివిధానాలు, ప్లేయర్ల రిటెన్షన్స్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ప్ర‌తి మూడేళ్లకు ఓసారి భారీ స్థాయిలో ఐపీఎల్ వేలం పాట‌ను నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News February 18, 2026

40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

<>HLL <<>>లైఫ్‌కేర్ లిమిటెడ్ 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు నేటి నుంచి మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, బీఫార్మసీ, MBA, MSW, PGDBM, MIB, MPIB, PGDPM, MA, MHRM, BSc ఉత్తీర్ణులు అర్హులు. నెలకు రూ.40K-రూ.1.40L చెల్లిస్తారు. CBT, పర్సనల్ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, DV, ఫైనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్:www.lifecarehll.com

News February 18, 2026

ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..

image

ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకొనే ఆహారాన్ని బట్టి బిడ్డ బరువు ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పిండం వెయిట్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవకాడో, గుడ్లు, పాలు, పాల పదార్థాలు, పప్పులు, నాన్ వెజ్, నట్స్, సీడ్స్, చిలగడదుంప వంటివి ఆహారంలో చేర్చుకుంటే కడుపులోని బిడ్డ బరువు పెరగడానికి సాయపడతాయంటున్నారు.

News February 18, 2026

‘తెల్లపారుడు వ్యాధి’ని కోళ్లలో ఎలా గుర్తించాలి?

image

‘సాల్మొనెల్లా పుల్లొరం’ బ్యాక్టీరియా వల్ల కోడి పిల్లల్లో తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.