News March 31, 2024
IPL: గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమవ్వగా.. సమద్(29*) అభిషేక్(29), క్లాసెన్(24) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ 3, ఒమర్జాయ్, ఉమేశ్, రషీద్, నూర్ తలో వికెట్ తీశారు. GT టార్గెట్ 163.
Similar News
News February 12, 2026
రష్యాలో వాట్సాప్ బ్లాక్!

వాట్సాప్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేయాలని ప్రయత్నిస్తోందని మెటా కంపెనీ ఆరోపించింది. వారి ఇంటర్నెట్ స్పేస్‌లో కంట్రోల్ కోసం సొంత యాప్స్‌ను ప్రమోట్ చేస్తోందని మండిపడింది. వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు తాము చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నామని తెలిపింది. కాగా తమ ఇంటర్నెట్ సిస్టమ్స్‌లో వాట్సాప్ డొమైన్స్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. MAX యాప్‌ను ఉపయోగించాలని తమ పౌరులను కోరుతోంది.
News February 12, 2026
ఈ నెల 16న ఛైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక

TG: 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ నెల 16న కలెక్టర్ల పర్యవేక్షణలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది. రేపు కౌంటింగ్ జరగనుండగా గెలిచిన అభ్యర్థులు 16న ఉ.11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మ.12.30 గంటలకు మెజార్టీ ఆధారంగా ఛైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక, తర్వాత వైస్ ఛైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎంపికలో ఎక్స్‌అఫీషియో(MPలు, ఎమ్మెల్యేలు, MLCలు) సభ్యుల ఓట్లూ కీలకం కానున్నాయి.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘త్రినేత్ర’’

శివుడి కుడి కన్ను సూర్యుడిని, ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుంది. ‘జ్ఞాన నేత్రం’ అని పిలిచే మూడో కన్ను అగ్నిని సూచిస్తుంది. సాధారణ కళ్లు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి. కానీ, మూడో కన్ను అంతరాత్మను, సత్యాన్ని దర్శిస్తుంది. అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి ఆ నేత్రమయం. అందుకే ఆయనను ముక్కంటి/త్రినేత్రుడు అంటారు. కామదహనంలో ఆయన తన మూడో కంటితోనే మన్మథుడిని భస్మం చేశాడు.


