News May 1, 2024

IPL: ఇవాళ్టి మ్యాచులో ‘కింగ్స్’ ఎవరో?

image

IPL 2024లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఇవాళ రాత్రి 07:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచులు జరగగా సీఎస్కే 15 సార్లు, పంజాబ్ 13 సార్లు విజయం సాధించాయి. కాగా పాయింట్ల పట్టికలో చెన్నై 4, పంజాబ్ 8వ స్థానంలో ఉన్నాయి. మరి ఇవాళ్టి మ్యాచులో అసలైన కింగ్స్‌గా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి.

Similar News

News December 9, 2025

సంక్రాంతి నుంచి సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే: CM

image

AP: ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌లోనే అందించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. RTGSపై సమీక్షలో మాట్లాడుతూ ‘వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి. రిజిస్ట్రేష‌న్ల తర్వాత డాక్యుమెంట్లను నేరుగా ఇళ్లకే పంపించాలి. RTC బ‌స్టాండ్లు, టాయ్‌లెట్ల వ‌ద్ద పరిశుభ్ర‌తను మెరుగుపర్చాలి. రైతులకు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించాలి’ అని సూచించారు.

News December 8, 2025

GHMCలో వార్డుల సంఖ్య రెట్టింపు

image

TG: GHMCలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో వార్డుల సంఖ్య డబుల్ అయ్యింది. ఈ విస్తరణతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్ PHOTO GALLERY

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు ముగిసింది. ఇవాళ రూ.1.88లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. CM రేవంత్ అన్నీ తానై పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన చూడవచ్చు.