News May 7, 2025

భారత్, పాక్ మధ్యవర్తిత్వానికి సిద్ధం: ఇరాన్

image

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ‘తమ సోదర దేశాలు ఇండియా, పాక్‌తో సంబంధాలను మేము ఎప్పుడూ ఆస్వాదిస్తాము. ఇలాంటి క్లిష్ట సమయంలో ఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య మంచి సంబంధాలు ఏర్పరచేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉంది’ అని ఇరాన్ విదేశాంగశాఖ ట్వీట్ చేసింది. దీనిపై ఇటు భారత్ కానీ, అటు పాక్ కానీ ఇంకా స్పందించలేదు.

Similar News

News February 16, 2026

AIపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం: మోదీ

image

ఢిల్లీలో ఇవాళ్టి నుంచి జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు వస్తున్న వరల్డ్ లీడర్లు, పారిశ్రామిక దిగ్గజాలు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ప్రధాని మోదీ స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు. ‘AIపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకంగా చేస్తున్నాం. అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమే ధ్యేయంగా సర్వజన హితం, సర్వజన సుఖం థీమ్‌తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. AI వినియోగంలో భారత్ ముందుంది’ అని పేర్కొన్నారు.

News February 16, 2026

12 ఏళ్లకే వండర్ చేశాడు

image

Phd విద్యార్థుల కలను ఏడో తరగతి విద్యార్థి మెక్‌మిలన్(12) సాధించాడు. US డల్లాస్‌లో చిన్న ప్లేరూమ్‌లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను నిర్మించాడు. 8 ఏళ్లకే న్యూక్లియర్ ఫిజిక్స్‌పై ఆసక్తి పెంచుకున్న చిన్నోడు ఓ సంస్థ సాయంతో ఈ ప్రాజెక్టును నిర్మించాడు. శాస్త్రీయ ఆవిష్కరణలకు వయసుతో సంబంధం లేదని చాటాడు. 2 తేలికైన పరమాణు కేంద్రకాలు కలిసి బలమైన కేంద్రకంగా మారినప్పుడు భారీగా శక్తి విడుదలవ్వడమే ఈ ప్రక్రియ.

News February 16, 2026

రూ.75వేల జీతంతో AERAలో ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(AERA)లో 3డేటా అనలిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ( స్టాటిస్టిక్స్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.75,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://aera.gov.in