News April 12, 2024

ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి మంచిదేనా?

image

ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. కానీ దాంట్లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందని.. అది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుందని కొందరు భయపడుతుంటారు. కానీ ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి హానికరం కాదని హార్వర్డ్ డాక్టరల్ విద్యార్థులు చెబుతున్నారు. ఇది కంటి చూపు, మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.

Similar News

News December 10, 2025

ఎండినవారికి ఇనుము తిండి

image

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.

News December 10, 2025

గణపతి స్తోత్రాన్ని ఎప్పుడు పఠించడం ఉత్తమం?

image

వినాయకుడి స్తోత్రాలు పఠించడానికి బుధవారం ఉత్తమ దినమని పండితులు చెబుతున్నారు. శుభ దినాలప్పుడు కూడా ప్రారంభించవచ్చని, సంకష్టహర చతుర్థి రోజున మొదలుపెట్టడం మరింత మేలని అంటున్నారు. ‘ప్రారంభించిన తర్వాత రోజూ పఠించడం చాలా ముఖ్యం. ఉదయాన్నే స్నానం చేసి, శుచిగా దీపారాధన చేసి, గణేశునికి కొంచెం గరిక, నైవేద్యాన్ని సమర్పించి స్తోత్రాన్ని పఠించాలి. చివరగా హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News December 10, 2025

నేటి నుంచి TET పరీక్షలు

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (TET) నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా 96.25% మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ నెల 21 వరకు రోజుకు 2 సెషన్లలో 9.30AM నుంచి 12PM, 2.30PM నుంచి 5PM వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.