News April 3, 2024

వర్షాలు పడకపోతే తప్పు మాదా?: శ్రీధర్ బాబు

image

TG: వర్షాలు పడకపోతే తమది తప్పా అని మంత్రి శ్రీధర్ బాబు మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. ‘2023 జులై నుంచే సరిపడా వానలు పడలేదు. వాటర్ ట్యాంకర్లకు డబ్బులు తీసుకున్నామని ఎవరైనా చెప్పారా? మిషన్ భగీరథ తప్పుడు పథకం. మీ కంటే ముందే మేము ఊరూరా నీళ్లిచ్చాం. రూ.45వేల కోట్లు ఖర్చు చేసినా ఇప్పుడు నీటి ఇబ్బంది ఎందుకు వచ్చిందో కేటీఆర్ సమాధానం చెప్పాలి’ అని శ్రీధర్ బాబు మండిపడ్డారు.

Similar News

News February 13, 2026

నీళ్లపై చర్చలకు మేము సిద్ధం: చంద్రబాబు

image

AP: నీటి సమస్యపై 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని CM CBN స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను AP అడ్డుకుంటోందన్న TG CM రేవంత్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో చంద్రబాబు స్పందించారు. ‘APలోని నల్లమల సాగర్‌ను TG అడ్డుకోవడం సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేం సపోర్ట్ చేశాం. 5000 TMCల గోదావరి నీరు వృథాగా పోతోంది. కృష్ణాలోనూ నీటి వృథా ఉంది. సమస్యలపై చర్చకు మేము సిద్ధం’ అని పేర్కొన్నారు.

News February 13, 2026

ఆటిజం‌కు చికిత్స ఇదే..

image

ప్రపంచంలోని ప్రతి 68 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం అంటారు. దీనికి చికిత్స లేదు కానీ చిన్న వయసునుంచే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల మార్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఉంటాయి. వీటితో పాటు తల్లిదండ్రులే శిక్షకులుగా మారాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 13, 2026

రాహుల్‌పై నోటీసు… స్పీకర్ నిర్ణయంపై ఆసక్తి

image

రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని BJP MP నిశికాంత్ దూబే సబ్‌స్టాంటివ్ మోషన్ నోటీసు ఇవ్వడం తెలిసిందే. దీనిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. దీన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించడంపై స్పీకర్ నిర్ణయించాలి. అది విచారించి ఇచ్చిన సిఫార్సును సభ ఆమోదానికి పెట్టాలి. సభ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చర్య చేపడతారు. గతంలో మొహువా మొయిత్రా (TMC MP)ని ఎథిక్స్ కమిటీ సిఫార్సుతో బహిష్కరించారు.