News April 20, 2024
నిజం చెప్పడం విద్యార్థుల నేరమా?: లోకేశ్

AP: విద్యాదీవెన, వసతిదీవెన అందడంలేదని CM జగన్‌కు చెప్పిన విద్యార్థులను ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ సస్పెండ్ చేయడంపై TDP నేత లోకేశ్ స్పందించారు. ‘నిజం చెప్పడం కూడా నేరమా? వైసీపీ నేతలు కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఆ విద్యార్థులను సస్పెండ్ చేయించడం దారుణం. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు విడుదల చేయాలి. స్టూడెంట్స్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 15, 2025
‘AGRATE’ ఏం చేస్తుంది?

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.
News December 15, 2025
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

<
News December 15, 2025
టమాటా కాయ ఆకృతి కోల్పోవడానికి కారణం ఏమిటి?

టమాటా కాయలు ఆకృతిని కోల్పోయే సమస్య ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది. పిందె కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కాయ ఆకృతి కోల్పోతుంది. పెద్ద పరిమాణం గల కాయరకాల్లో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. దీని నివారణకు కలుపు మందులు లేదా పెరుగుదలను నియంత్రించే రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. టమాట పంటను మురుగు నీరు బయటకు పోయే వసతి లేని నేలల్లో పండించకూడదు.


