News May 23, 2024
ఆ ఒక్క వీడియోనే లీకైందా?: సజ్జల

AP: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి EVM ధ్వంసం చేసిన వీడియో ఒక్కటే లీకైందా అని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆ వీడియో సరైనదేనా? కాదా అని కూడా చూడకుండా ఈసీ చర్యలు తీసుకోవడం ఏంటని నిలదీశారు. ‘పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతోంది. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని వీడియోలు బయటపెట్టాలి. అప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది’ అని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News March 10, 2026
FDI రూల్స్ సడలించిన కేంద్రం

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2020లో తెచ్చిన రూల్స్‌ను సవరించినట్లు తెలుస్తోంది. పాత రూల్‌లో చైనా సహా భారత్‌తో సరిహద్దు పంచుకున్న దేశాల సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే కేంద్రం అనుమతి ఉండాల్సిందే. ఇతర విదేశీ సంస్థలైనా సరే వాటిలో ఈ దేశాల వాటా ఉంటే ఈ రూల్ వర్తిస్తుంది. చైనాతో ఉద్రిక్తతలు, దేశ భద్రత దృష్ట్యా గతంలో ఈ నిబంధన తెచ్చింది. తాజాగా ఈ నిబంధన మార్చింది.
News March 10, 2026
ఈనెల 13న పీఎం కిసాన్ నిధులు విడుదల

పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులను అర్హులైన రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేయనున్నారు. దీని వల్ల 9.32 కోట్ల మంది రైతులకు లబ్ధి కలగనుంది. 2019 నుంచి కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలను పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
News March 10, 2026
BREAKING: 13న అకౌంట్లలో డబ్బులు జమ

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారు. కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.


