News May 2, 2024
మోదీతో కలిస్తే నేరస్థుల సేఫ్టీకి గ్యారంటీనా?: రాహుల్ గాంధీ

JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారం సంచలనమైన వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘యథావిధిగా ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారు. ఆయన మౌనంగా ఇస్తున్న మద్దతుతో క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. వందలాది ఆడబిడ్డల జీవితాలను నాశనం చేసిన అతను దేశం విడిచి అంత సులువుగా ఎలా పరారయ్యాడు? మోదీతో చేతులు కలిపితే క్రిమినల్స్ భద్రతకు గ్యారంటీ దక్కినట్టా?’ అని మండిపడ్డారు.
Similar News
News December 12, 2025
T20ల్లో వరల్డ్ రికార్డ్.. ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు

T20I క్రికెట్‌లో 33ఏళ్ల బహ్రెయిన్ బౌలర్ అలీ దావూద్ ప్రపంచ రికార్డు సృష్టించారు. భూటాన్‌పై కేవలం 19 పరుగులే ఇచ్చి 7 వికెట్లు తీశారు. టీ20 చరిత్రలో ఇదే సెకండ్ బెస్ట్ స్టాట్స్. ఫస్ట్ ప్లేస్‌లో మలేషియాకు చెందిన స్యాజ్రుల్ ఇద్రుస్(7/8), మూడో స్థానంలో సింగపూర్ ప్లేయర్ హర్షా భరద్వాజ్(6/3), ఫోర్త్ ప్లేస్‌లో నైజీరియా బౌలర్ పీటర్ అహో(6/5), ఐదో స్థానంలో టీమ్ ఇండియా బౌలర్ దీపక్ చాహర్(6/7) ఉన్నారు.
News December 12, 2025
పాకిస్థాన్‌లో సంస్కృతం, మహాభారతం కోర్సులు

పాకిస్థాన్‌లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లో (LUMS) సంస్కృతాన్ని అధికారిక కోర్సుగా ప్రారంభిస్తున్నారు. దీంతో పాటు మహాభారతం, భగవద్గీత శ్లోకాలను సైతం విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. అయితే దీని వెనుక ప్రొఫెసర్ షాహిద్ రషీద్ కృషి ఉంది. రాబోయే 10-15 ఏళ్లలో పాకిస్థాన్ నుంచి భగవద్గీత, మహాభారతానికి చెందిన స్కాలర్లు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 12, 2025
జియో యూజర్లకు గుడ్‌న్యూస్

జియో స్టార్‌తో తమ కాంట్రాక్ట్ కొనసాగుతుందని ICC స్పష్టం చేసింది. క్రికెట్ మ్యాచుల స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో రద్దు చేసుకోనుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రకటన విడుదల చేసింది. రానున్న టీ20 WCతో పాటు ICC ఈవెంట్లన్నింటినీ నిరంతరాయంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై జియో హాట్‌స్టార్‌లో ఫ్రీగా మ్యాచులు చూడలేమనుకున్న యూజర్లకు ఈ ప్రకటన భారీ ఊరట కలిగించింది.


