News March 14, 2025

గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా?: వైసీపీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు.. వినిపించదు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News February 17, 2026

IOCL 121పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>IOCL<<>> హల్దియా రిఫైనరీ 121 ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc(MPC, ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీ), సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత గలవారు ఫిబ్రవరి 24 వరకు NATS/NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com

News February 17, 2026

జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

image

AP: YS జగన్ అక్రమాస్తుల కేసులో IAS శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. కేసులో తన పేరును తొలగించాలన్న డిశ్ఛార్జ్ పిటిషన్‌ను SC తిరస్కరించింది. HC తీర్పును సమర్థించింది. నిబంధనలకు అనుగుణంగా తాను పనిచేశానని శ్రీలక్ష్మి విన్నవించగా రూల్స్‌ను పాటించలేదని CBI వాదించింది. శ్రీలక్ష్మి అండతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపింది.

News February 17, 2026

AIIMS రిషికేశ్‌లో కాంట్రాక్ట్ పోస్టులు

image

AIIMS రిషికేశ్ 3 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BSc నర్సింగ్, బీఫార్మసీ, డీ ఫార్మసీ, BSc మెడికల్ టెక్నాలజీ, BSc (రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్), BSc(కంప్యూటర్ అప్లికేషన్స్) అర్హత గలవారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫార్మాసిస్ట్‌, టెక్నీషియన్‌కు రూ.40K, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.30K చెల్లిస్తారు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.