News August 22, 2025
మీ ఫోన్‌లో ఇలా అవుతోందా?

పలు ఫోన్లలో కాలింగ్ ఇంటర్‌ఫేజ్ మారింది. కాల్ చేస్తే పెద్ద అక్షరాలు స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. కాల్ రిసీవింగ్, కట్ చేసేందుకు పైకి, కిందకి కాకుండా సైడ్‌కు స్లైడ్ చేయాల్సి వస్తోంది. ఆల్ కాల్స్, మిస్డ్ కాల్స్, కాంటాక్ట్స్, నాన్-స్పామ్, స్పామ్ అని చూపిస్తోంది. రియల్‌మీ, వన్ ప్లస్, మోటో, ఒప్పో, వివో, ఐక్యూ మోడళ్లలో ఈ మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు తమకు మార్పులు కనిపించట్లేదని అంటున్నారు.
Similar News
News January 18, 2026
మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

మాడ్యులర్ కిచెన్ చేయించేటపుడు వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరుకులన్నీ భద్రపరచడానికి వీలుగా అల్మారా లేదా డీప్ డ్రాలను నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్‌లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనే సౌలభ్యం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట్లలో ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.
News January 18, 2026
ప్రైవేట్ స్కూళ్లలో రెండేళ్లకోసారి 8% ఫీజు పెంపు?

TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజును రెండేళ్లకోసారి 8% పెంచుకునేలా అనుమతించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతకుమించి పెంచుకోవాలంటే రాష్ట్ర ఫీజు నియంత్రణ కమిటీ ఆమోదం తప్పనిసరి చేస్తూ ఫీజుల నియంత్రణ చట్టం విధివిధానాలను ఖరారు చేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
News January 18, 2026
జీవ ఎరువుల వాడకం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైతు వాడే జీవ ఎరువు ఆ పంటకు సరైనదై ఉండాలి. ఈ ఎరువు ప్యాకెట్లను నీడ ప్రదేశంలోనే నిల్వచేయాలి. ప్యాకెట్‌పై పేర్కొన్న గడువు తేదీలోపే వాడుకోవాలి. రసాయన ఎరువులతో కలిపి జీవ ఎరువులు వాడరాదు. పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే వీటిని వాడుకోవాలి. సేంద్రియ ఎరువుతో జీవ ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి. ఈ ఎరువులను తొలిసారి వినియోగిస్తుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకే వినియోగించాలి.


