News April 22, 2024

విరాట్ కోహ్లీది ఔటా? నాటౌటా?

image

కేకేఆర్‌తో మ్యాచ్‌లో RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔట్ వివాదాస్పదంగా మారుతోంది. హర్షిత్ రాణా వేసిన స్లో ఫుల్ టాస్ బంతిని విరాట్ డిఫెన్స్ ఆడటంతో బంతి గాల్లోకి లేచి రిటర్న్ క్యాచ్ అందుకున్నారు. బాల్ నడుము కంటే పైకి వచ్చిందని కోహ్లీ రివ్యూ తీసుకున్నారు. కానీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఇది కొందరు ఔట్ అని.. మరికొందరు నాటౌట్ అని వాదిస్తున్నారు. మరి ఇది ఔటా.. నాటౌటా కామెంట్ చేయండి.

Similar News

News December 15, 2025

AP న్యూస్ రౌండప్

image

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.
* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు.
* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్ బెయిల్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

News December 15, 2025

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేడు బాధ్యతలు చేపట్టనున్న నితిన్

image

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి నితిన్ నబీన్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నితిన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ నుంచి నియమితులైన తొలి వ్యక్తిగా, పిన్న వయస్కుడిగానూ ఆయన నిలిచారు. త్వరలోనే నితిన్‌ను జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశముందని తెలుస్తోంది.

News December 15, 2025

ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాల వలస

image

AP: రాష్ట్రంలో ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాలు వలస వెళ్లినట్లు సచివాలయాల సర్వేలో వెల్లడైంది. వారంతా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో పనులు చేసుకుంటున్నట్లు తేలింది. రాష్ట్రంలో 1.71 కోట్ల కుటుంబాలుండగా అత్యధికంగా విశాఖ(D)లో 1.13 లక్షలు, నెల్లూరులో 85వేల ఫ్యామిలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా నిర్మాణ రంగంలో పనులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.