News March 18, 2024
టికెట్ దొరకడం కష్టమే

CSK, RCB మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చెన్నై వేదికగా ఈ నెల 22న జరగనున్న ఈ మ్యాచ్ కోసం టికెట్లు అన్నీ బుకింగ్ అయిపోయాయి. ముందస్తు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టికెట్ స్లాట్‌ను బుక్ చేసుకున్నారు. తాజాగా పేటీఎం ఇన్‌సైడర్‌లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా ప్రస్తుతం ‘YOU ARE NOW IN THE QUEUE’ అని చూపిస్తోంది. టికెట్ల ధరలు రూ.1,700 నుంచి రూ.7,500 వరకు ఉన్నాయి.
Similar News
News December 10, 2025
అమరావతి నిర్మాణం ఆగకుండా మెటీరియల్!

AP: అమరావతిలో నిర్మాణ పనులు ఆగకుండా మెటీరియల్ సరఫరా చేసే నిమిత్తం 4 జిల్లాల అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రావెల్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక సరఫరాలో సమస్యలున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ అధ్యక్షతన ఈ అధికారులు కమిటీగా ఏర్పడి మెటీరియల్ డిమాండ్, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. సరఫరాలో అడ్డంకులను తొలగించడం, అనుమతులు ఇప్పించడంలో కమిటీ బాధ్యత వహిస్తుంది.
News December 10, 2025
పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.
News December 10, 2025
ఏపీ న్యూస్ రౌండప్

✒ జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి Dy కలెక్టర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
✒ గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.2,123కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు
✒ రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది DEOలు ట్రాన్స్‌ఫర్
✒ అమరావతికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ఈ-లాటరీ
✒ తిరుమల కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్, ఏ29 సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న సీబీఐ-సిట్ అధికారులు


