News January 30, 2025

300 మంది చనిపోతే 30 మంది అని అబద్ధాలు: కేఏ పాల్

image

మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనలో 300 మంది చనిపోతే 30 మంది చనిపోయారని యూపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. కుంభమేళా తొక్కిసలాటలో నిజానిజాలు బయటపెట్టేందుకు సుప్రీంకోర్టులో పిల్ వేస్తానని తెలిపారు. ఆధ్యాత్మిక వేడుకల్లో విషాద ఘటనల నేపథ్యంలో కుంభమేళానే కాకుండా టీటీడీ వంటి దేవాలయాల్లోనూ వీఐపీ ఎంట్రన్స్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 14, 2025

సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ సంచలన కామెంట్స్

image

TG: పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని, వెళ్లిపోమంటే వెళ్లిపోతానని గోషామహల్ BJP MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని SC లేదా BCకి ఇవ్వాలని సూచిస్తే MIMతో తిరిగే వ్యక్తికిచ్చారు. ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి వస్తోంది. కొందరు అనుసరిస్తున్నట్లు బ్రోకరిజం వల్లే పార్టీ వెనుకబడింది. రాష్ట్రంలో BJP ప్రభుత్వం రావడం లేదు’ అని విమర్శించారు.

News February 14, 2025

తెలుగు డైరెక్టర్ తండ్రి కన్నుమూత

image

తెలుగు సినిమా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తండ్రి ఏలేటి సుబ్బారావు (75) కన్నుమూశారు. తూ.గో జిల్లా తుని మం. రేఖవానిపాలెంలోని తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రాజమౌళి భార్య ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ‘ఐతే’ మూవీతో కెరీర్ ప్రారంభించిన చంద్రశేఖర్ అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా లాంటి సినిమాలు తీశారు.

News February 14, 2025

విశ్వక్‌సేన్ ‘లైలా’ పబ్లిక్ టాక్

image

విడుదలకు ముందే రాజకీయ వివాదాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ‘లైలా’ సినిమా ప్రీమియర్ షోలు USలో ప్రారంభమయ్యాయి. సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ అదరగొట్టారని, సినిమా అంతా వన్ మ్యాన్ షో అని ప్రశంసిస్తున్నారు. అయితే స్టోరీ ఔట్‌డేటెడ్ అని, ఇంట్రెస్టింగ్ సీన్లు లేవని కొందరు పెదవి విరుస్తున్నారు. పూర్తి రివ్యూ, రేటింగ్ మరికొన్ని గంటల్లో..

error: Content is protected !!