News April 20, 2024

చిరంజీవిని జగన్ అవమానించారు: పవన్

image

AP: రాజానగరం వారాహి సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా చుట్టూ ఉన్నవారు ఎవరో తెలియాలనే పొగపెట్టా. అందరూ వైసీపీలోకి వెళ్లారు. పోలవరం పూర్తిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే. నాపై చాలాసార్లు రాళ్లు విసిరారు, తట్టుకున్నా. జగన్‌లా డ్రామాలు ఆడలేదు. సినిమా టికెట్ ధరలు పెంచాలని వెళ్తే.. చిరంజీవిని జగన్ అవమానించారు’ అని ఫైరయ్యారు.

Similar News

News December 9, 2025

పవన్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ ఏమన్నారంటే?

image

AP: Dy.CM పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలోనే అన్నారని, ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని తెలిపారు. పవన్‌కు TG ప్రజలపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. ఆ మాటలపై అనవసర రాద్దాంతం చేశారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేయగా, మరో మంత్రి కందుల దుర్గేశ్ సైతం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

News December 9, 2025

మా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్: గల్లా జయదేవ్

image

TG: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని మాజీ ఎంపీ, అమర్‌రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో రూ.9వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అని పేర్కొన్నారు. మరోవైపు అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.

News December 9, 2025

చైనాకు వెళ్తుంటే జాగ్రత్త!

image

భారతీయులు చైనాకు వెళ్తున్నా, ఆ దేశం మీదుగా ప్రయాణిస్తున్నా జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ సూచించింది. ఇటీవల షాంఘై ఎయిర్‌పోర్టులో AR.P మహిళను <<18509379>>నిర్బంధించిన<<>> నేపథ్యంలో హెచ్చరించింది. భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. నిర్బంధించడం మానుకొని విమాన ప్రయాణ నిబంధనలు గౌరవిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.