News April 25, 2024
మలి విడత ప్రచారానికి జగన్ సిద్ధం!

AP: సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర నిన్నటితో ముగిసింది. ఇవాళ నామినేషన్ వేసిన జగన్.. మలి విడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 27 లేదా 28న ప్రచారం ప్రారంభం కానుంది. పోలింగ్ జరిగే నాటికి 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా వైసీపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది.
Similar News
News April 14, 2026
IEBలో 28 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్(IEB), ముంబైలో 28 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వీటిలో మేనేజ్‌మెంట్ ట్రెయినీ-22, డిప్యూటీ మేనేజర్-5, చీఫ్ మేనేజర్-1 పోస్టులున్నాయి. 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, LLB/BE/B.Tech/PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం www.eximbankindia.in చూడండి.
News April 14, 2026
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే?

గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన ‘OG’ సినిమా పార్ట్-2 పనులు మొదలైనట్లు సమాచారం. ఇందులో పవర్ స్టార్ మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్ మరో లెవెల్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఓజస్ గంభీర-ర్యాంపేజ్ బిగిన్స్’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తాయని టాక్. పవన్ డేట్స్‌ను బట్టి షూటింగ్ మొదలవుతుందట.
News April 14, 2026
సిలిండర్లకూ ఎక్స్‌పైరీ డేట్.. తెలుసుకోకుంటే డేంజరే!

ఇళ్లు, హోటళ్లలో వాడే గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ తేదీ దాటినవి వాడితే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే. సిలిండర్ పైభాగంలోని నంబర్లను బట్టి వాటి కాలపరిమితిని తెలుసుకోవచ్చు. A-27, B-28, C-29, D-30 నంబర్లు ఉంటే అందులో A: జనవరి-మార్చి, B: ఏప్రిల్-జూన్, C: జులై-సెప్టెంబర్, D: అక్టోబర్- డిసెంబర్ అని అర్థం. నంబర్లు ఏడాదిని సూచిస్తాయి. A-27 అంటే 2027 మార్చి వరకు అది సేఫ్.
#ShareIt


