News April 21, 2024
జగన్ రెడ్డి ఓ మూర్ఖుడు: పవన్

AP: ప్రతీ రోజు ముగ్గురు భార్యలు అంటూ హేళన చేస్తున్న సీఎం జగన్ ఓ మూర్ఖుడు అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఎప్పుడు చూసినా జగన్ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. మాట్లాడితే ముగ్గురు పెళ్లాలు అంటారు. అందరి ఇళ్లలో విభేదాలు ఉంటాయి. నా ఇంట్లో కూడా అలానే విభేదాలు ఉన్నాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏంటీ? నా వ్యక్తిగత విషయాల జోలికి వస్తే తాట తీస్తా’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News December 15, 2025
రబీ సాగు నిరాశాజనకం

APలో రబీ సాగు ఆశించినస్థాయిలో సాగడం లేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేశారు. మొంథా, దిత్వా తుఫాన్ల కారణంగా ఖరీఫ్ పంటల కోతలు ఆలస్యమవడం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ కింద వరి సాగుకు నీటి గ్యారంటీ లేకపోవడమూ మరో కారణమని పేర్కొంటున్నారు.
News December 15, 2025
పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.
News December 15, 2025
ధనుర్మాసం ఎందుకంత ప్రత్యేకం?

సూర్యుడు ధనురాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే పరమ పవిత్రమైన సంధికాలం. ఇది దేవతలకు రాత్రి చివరి భాగం వంటిది. ఈ మాసంలో సత్త్వగుణం వృద్ధి చెందుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ అని చెప్పాడు. ఆధ్యాత్మిక, భౌతిక ఫలాలను పొందడానికి, దైవారాధన చేయడానికి, దానధర్మాలు ఆచరించడానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనది.


