News April 13, 2024
14వ రోజుకు చేరిన జగన్ బస్సు యాత్ర

AP: సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. ఉమ్మడి గుంటూరు(D) నంబూరు బైపాస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, CK కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కానున్నారు.
Similar News
News December 17, 2025
ఆముదంతో చర్మం, గోళ్ల సంరక్షణ

చర్మం ముడతలు పడకుండా చేసే గుణాలు ఆముదంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘చమురు రాసుకుని స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది. ఆముదంతో రోజూ 10ని. గోళ్లకు మర్దన చేసుకుంటే అవి దృఢంగా మారి విరగకుండా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు, నిద్ర లేచాక చమురు రాసుకుంటే పెదవులు కోమలంగా ఉంటాయి’ అని చెబుతున్నారు. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీనికి దూరంగా ఉంటే మంచిందంటున్నారు.
News December 17, 2025
జనవరి 1న ‘భారత్ టాక్సీ’ ప్రారంభం

ప్రయాణికులకు, డ్రైవర్లకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ యాప్‌ను జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా దీనిని తీసుకొస్తోంది. తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో ఇందులో అధిక ఛార్జీలు ఉండవు. ఇప్పటికే 56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం.
News December 17, 2025
కొండెక్కిన వెండి ధరలు

వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కేజీపై ఏకంగా రూ.11వేలు పెరిగింది. దీంతో ఓవరాల్ రేట్ రూ.2,22,000కు చేరింది. అటు బంగారం ధరలు కూడా మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 పెరిగి రూ.1,34,510గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరిగి రూ.1,23,300కు చేరింది.


