News June 18, 2024

ఎన్నికలపై జగన్ సంచలన ట్వీట్

image

AP: అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాలని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News January 16, 2026

ఢిల్లీలో కలవరపెడుతున్న శ్వాసకోశ మరణాలు

image

ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల కారణంగా 2024లో 9,211 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇది 2023తో పోలిస్తే 410 ఎక్కువ మరణాలుగా అధికారులు తెలిపారు. ఆస్తమా, న్యుమోనియా, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జననాల సంఖ్య తగ్గడం, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్నాయి.

News January 16, 2026

జనవరి 16: చరిత్రలో ఈ రోజు

image

1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జననం (ఫొటోలో)
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1988: భారత ఆర్థికవేత్త ఎల్.కె.ఝా మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం
2016: బాలీవుడ్ దర్శకుడు అనిల్ గంగూలీ మరణం

News January 16, 2026

జనవరి 30న నీటి వివాదాలపై తొలి కీలక సమావేశం

image

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడనుంది. AP, TG, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, CWC అధికారులతో కూడిన అధికారిక కమిటీ తొలి సమావేశం జనవరి 30న ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య నీటి యాజమాన్య వివాదాలపై చర్చ జరగనుంది. KRMB, GRMB ప్రతినిధులు కూడా పాల్గొని తాజా పరిస్థితులపై నివేదికలు సమర్పించనున్నారు.