News April 14, 2024
గెలిచే వరకు చెప్పులు తొడగనన్న అభిమానికి జగ్గారెడ్డి హితబోధ

TG: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ గెలిచే వరకు చెప్పులు తొడుక్కోనని ఓ అభిమాని శపథం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి అతనికి హితబోధ చేశారు. ‘ఓడిపోయిన నేను, నా భార్య చెప్పులేసుకుని తిరుగుతున్నాం. నీకెందుకు అంత బాధ?. నీకు ఏదైనా జరిగితే నేను ఆస్పత్రి వరకే వస్తా.. డబ్బులు ఇస్తా. అంతేగానీ నీవెంట రాలేను కదా. అభిమానం మనసులో ఉంచుకోవాలిగానీ ఇలా చేయొద్దు’ అని చెప్పారు.
Similar News
News December 17, 2025
APPLY NOW: HALలో ఉద్యోగాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)లో 9 డిప్లొమా టెక్నీషియన్, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత గల వారు DEC 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా(మెకానికల్, ఎలక్ట్రికల్), ITI+NAC అర్హత కలిగినవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: hal-india.co.in
News December 17, 2025
మేకప్ రోజంతా ఉండాలంటే ఇలా చేయండి

మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే ముందుగా చర్మాన్ని శుభ్రం చేసి, టోనర్ అప్లై చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఆపై ప్రైమర్ ఉపయోగించాలి. జిడ్డు చర్మం వారు మ్యాటిఫైయింగ్ ఫార్ములాను, చర్మం పొడిగా అనిపిస్తే హైడ్రేటింగ్ ప్రైమర్‌ను వాడాలి. తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకొని మేకప్ సెట్ చేసుకోవాలి. ఇలా చేస్తే రోజంతా మెరిసిపోయే మేకప్ మీ సొంతం అవుతుంది.
News December 17, 2025
టాటా కొత్త కారు.. ఫస్ట్ రోజే 70వేల బుకింగ్స్

టాటా మోటార్స్ నూతనంగా తీసుకొచ్చిన ‘<<18386296>>సియారా<<>>’ మోడల్ కారు రికార్డులు బ్రేక్ చేస్తోంది. బుకింగ్ ప్రారంభమైన తొలిరోజే (డిసెంబర్ 16) 70వేల బుకింగ్స్ అయ్యాయని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ SUV ధర రూ.11.49 లక్షల-రూ.21.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రెడ్, ఎల్లో, సిల్వర్, గ్రీన్, మింటల్ గ్రే, వైట్ కలర్లలో అందుబాటులో ఉన్నాయి.


