News February 17, 2025

బంగ్లా విదేశాంగ సలహాదారుతో జైశంకర్ భేటీ

image

బంగ్లా విదేశాంగ సలహాదారు తౌహిద్ హొస్సేన్‌తో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా భేటీ అయ్యారు. ‘ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి మా భేటీలో చర్చించాం. అదే విధంగా BIMSTEC గురించీ మాట్లాడుకున్నాం’ అని ట్విటర్లో వెల్లడించారు. బంగ్లా, భారత్, శ్రీలంక థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్, నేపాల్ దేశాల మధ్య పలు రంగాల్లో సహకారం కోసం ఏర్పాటు చేసిందే BIMSTEC. ఈ ఏడాది సదస్సుకు బంగ్లా నేతృత్వం వహించనుంది.

Similar News

News March 6, 2026

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌పై నెట్టింట ప్రశంసలు

image

పిల్లలను SM తప్పుదారి పట్టిస్తోందని దీనిని బ్యాన్ చేయడం కరెక్టేనని తల్లిదండ్రుల నుంచి అభిప్రాయం వినిపిస్తోంది. తాజాగా KA ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వీరు ఆహ్వానిస్తున్నారు. నేర్చుకునేందుకు SMలో ఎంతో మంచి కంటెంట్ ఉంటే పిల్లలు మాత్రం తప్పుదారి పట్టించే వీడియోలవైపే అట్రాక్ట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమంటున్నారు. మీ కామెంట్?

News March 6, 2026

గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం!

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ LPG విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లను ప్రధానంగా గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు స్పష్టం చేసింది. IOCL, BPCL, HPCLకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్, ఇండస్ట్రియల్, పెట్రో కెమికల్ రంగాలకు గ్యాస్ సప్లైపై తాత్కాలిక పరిమితులు విధించింది. సాధారణ ప్రజలకు LPG సరఫరాలో అంతరాయం ఉండొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News March 6, 2026

మైనర్లకు SM బ్యాన్.. దేశవ్యాప్తంగా చేయాల్సిందేనా?

image

మైనర్లకు SMను బ్యాన్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. APలో కూడా ఈ తరహా విధానంపై కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల మంత్రి లోకేశ్ ప్రకటించారు. అయితే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 16 ఏళ్లలోపు పిల్లలకు SMను నిషేధించడం అత్యవసరమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. టీనేజర్లు వీటి బారినపడి అశ్లీలత, సమయం వృథా, చెడు అలవాట్లకు గురవుతున్నారని అంటున్నారు.