News February 15, 2025

పెళ్లి పీటలు ఎక్కిన ‘జాలి రెడ్డి’

image

‘పుష్ప’ సినిమాలో జాలి రెడ్డి పాత్రతో ఫేమస్ అయిన కన్నడ నటుడు ధనుంజయ ఓ ఇంటివాడవుతున్నారు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతను మైసూరులో రేపు ఉదయం వివాహం చేసుకోనున్నారు. ఇవాళ జరిగిన రిసెప్షన్‌కు డైరెక్టర్ సుకుమార్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నిన్న హల్దీ ఫంక్షన్ వైభవంగా జరిగింది. ఇతను కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలకు పాటలు కూడా రాశారు.

Similar News

News April 14, 2026

శ్రీవారి సంపదకు రక్షకులు ఎవరో తెలుసా?

image

శ్రీవారి ఆలయంలోని నిధులు, సంపదలను రక్షించడానికి ప్రత్యేకంగా ఇద్దరు దేవతలు ఉన్నారు. వారే శంఖనిధి, పద్మనిధి. వీరి విగ్రహాలు ఆలయ మహద్వారానికి ఇరువైపులా దర్శనమిస్తాయి. మనం క్యూలో లోపలికి వెళ్లేటప్పుడు ద్వారపాలకుల్లా కనిపించేది వీరే. ఈ విగ్రహాలు దాదాపు రెండడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. వీటిని పంచ లోహాలతో తయారు చేశారు. ఈ దేవతలు శ్రీవారి ధనాన్ని కాపాడే ముఖ్యమైన రక్షకులుగా భక్తులు భావిస్తారు.

News April 14, 2026

గృహ ప్రవేశ సమయంలో గోవు ఎందుకు?

image

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంటి నిర్మాణంలో తెలియక చేసిన దోషాలను తొలగించడానికి గోమాతను ఇంట్లోకి తీసుకువస్తారు. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రతకు నిలయంగా కూడా భావిస్తారు. గోమూత్రం, గోమయం పవిత్రమైనవి. గోవు ప్రవేశంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే గోవు పాలు, పెరుగు వంటివి వాడటం వలన శరీరానికి, మనసుకు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.

News April 14, 2026

అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

image

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.