News April 20, 2024

జనసేన అభ్యర్థి ఆస్తి రూ.894 కోట్లు!

image

AP: తనకు రూ.894.92 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి అఫిడవిట్‌లో వెల్లడించారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, విద్యాసంస్థలు, భూములు, నగలు, బ్యాంకుల్లో డిపాజిట్ల వంటి రూపంలో ఆస్తులున్నాయి. బ్యాంకులో రూ.4.42 కోట్లు, చేతిలో రూ.1.15 లక్షల నగదు ఉన్నాయి. చరాస్తులు రూ.856.57 కోట్లు, స్థిరాస్తులు రూ.15.70 కోట్లు, రూ.2.69 కోట్ల అప్పు ఉన్నట్లు మాధవి తెలిపారు.

Similar News

News December 13, 2025

AP గోదావరి నీటి మళ్లింపును అనుమతించొద్దు: ఉత్తమ్

image

TG: గోదావరి నీటి మళ్లింపునకు AP పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ పేరిట చేపట్టే ప్రాజెక్టును అధికారులు ఇవాల్యుయేషన్ చేయకుండా నిలువరించాలని కేంద్రం, CWCలను TG కోరింది. అలాగే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలనూ అడ్డుకోవాలంది. వీటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్, TGకి కృష్ణా నీటి కేటాయింపు తదితరాలపై సహకారాన్ని అభ్యర్థించారు.

News December 13, 2025

రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్, అఖిలేశ్

image

TG: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. కేఫ్‌లో వారిద్దరూ టిఫిన్ చేశారు. ఈ ఫొటోలను కేటీఆర్ తన X ఖాతాలో షేర్ చేశారు. కాగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్.. తొలుత సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

News December 13, 2025

మహిళలూ ఈ తప్పులు చేస్తున్నారా?

image

మహిళలు చేసే కొన్ని తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఏడాదీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, తక్కువ పండ్లు, కూరగాయలు తిన్నప్పుడు ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు లోపిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి HPV ఇన్ఫెక్షన్‌‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వీటితో పాటు గర్భధారణలో చేసే తప్పులు కూడా దీనికి కారణమంటున్నారు.