News March 14, 2025

జనసేన ఆవిర్భావ సభ: దారులన్నీ చిత్రాడ వైపే..

image

AP: కాసేపట్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు చిత్రాడకు బయల్దేరారు. సభ కోసం 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. పవన్ సహా 250 మంది వేదికపై కూర్చుంటారు. డొక్కా సీతమ్మ, రాజా సూర్యారావు బహుద్దూర్, మల్లాడి నాయకర్ పేర్లతో ద్వారాలు సిద్ధం చేశారు. పవన్ మ.3.30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు.

Similar News

News February 17, 2026

నేడు విశాఖకు రాష్ట్రపతి

image

AP: రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు విశాఖపట్నం చేరుకోనున్నారు. 4.40PMకు నేవల్ ఎయిర్ స్టేషన్ ‘INS డేగా’ వద్ద ల్యాండ్ అవుతారు. నేవల్ బేస్‌లో నిర్వహించే విందులో పాల్గొంటారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా రేపు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు విశాఖ వెళ్లనున్నారు.

News February 17, 2026

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

image

కొంద‌రిలో క‌నుబొమ్మ‌లు చాలా ప‌లుచ‌గా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* క‌నుబొమ్మ‌లపై రోజూ ఆముదం నూనెను రాయ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా క‌ల‌బంద జెల్ ను క‌నుబొమ్మ‌ల‌పై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. * కొబ్బ‌రి నూనెలో రోజ్‌మేరీ నూనెను క‌లిపి క‌నుబొమ్మ‌ల‌పై మ‌ర్ద‌నా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.

News February 17, 2026

‘ఫర్టిగేషన్’తో సాగులో మరిన్ని లాభాలు

image

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.