News March 27, 2024

ఏప్రిల్ 6 లేదా 7న జనజాతర సభ: సీఎం రేవంత్

image

TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7న కాంగ్రెస్ ‘జనజాతర’ సభ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఇచ్చే గ్యారంటీ హామీలను ఈ సభలోనే ప్రకటిస్తామన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సభకు హాజరై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసేందుకు ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.

Similar News

News February 16, 2026

ఎన్టీఆర్ జిల్లాలో కనుమరుగవుతున్న మామిడి తోటలు

image

ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల దాడితో మామిడి రైతులు తోటలను తొలగిస్తున్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఇన్సూరెన్స్ సమస్యలతో ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 4,580 హెక్టార్ల మామిడి తోటలు తొలగించబడ్డాయి. సాగు, కోత ఖర్చుల భారం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మామిడి సాగు పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.

News February 16, 2026

నేడు యథావిధిగా PGRS

image

భీమవరం కలెక్టరేట్‌, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు.

News February 16, 2026

రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు: అమిత్ షా

image

USతో ట్రేడ్ డీల్‌తో కేంద్రం రైతులకు <<19151159>>ద్రోహం చేస్తోందని<<>> రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. రైతుల గురించి పార్లమెంటులో రాహుల్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.