News February 18, 2025

అల్లు అర్జున్ సినిమాలో జాన్వీ కపూర్?

image

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ అట్లీ చిత్రం దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్‌తోనే అని బన్నీఒక ప్రైవేట్‌ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ షెడ్యూల్ తదితర కారణాల రీత్యా పుష్ప-2 తర్వాత తన తదుపరి చిత్రం అట్లీతో చేయనున్నారట. ఈ మూవీపై పూర్తి అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయి.

Similar News

News April 14, 2026

మరోసారి శాంతి చర్చలు..? తగ్గిన క్రూడాయిల్ ధర

image

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఊగిసలాడుతున్నాయి. మరోసారి US-ఇరాన్ శాంతి <<19644378>>చర్చలకు<<>> అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ రేట్లు తగ్గాయి. నిన్న $100 పైగా ఎగిసిన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేట్ $97కు పడిపోయింది. నేచురల్ గ్యాస్, గ్యాసోలిన్, హీటింగ్ ఆయిల్ ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. అయితే నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు మాత్రం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.

శివునికి ఏ అభిషేకంతో ఏ ఫలితం వస్తుంది?

image

శివాభిషేకంలో వాడే ప్రతి వస్తువు ఓ ప్రత్యేక ఫలితాన్నిస్తుందని నమ్మకం. ఆవు పాలతో సౌఖ్యాలు, పెరుగుతో బలం, నెయ్యితో ఐశ్వర్యం, కొబ్బరి నీటితో సంపద, చెరకు రసంతో ధనవృద్ధి కలుగుతుందట. నీటితో పోగొట్టుకున్నవి తిరిగి దక్కుతాయట. ద్రాక్ష రసంతో విజయం, పసుపు నీటితో శుభాలు, తేనెతో తేజోవృద్ది, అన్నంతో దీర్ఘాయువు, భస్మంతో పాపాలు నశిస్తాయని విశ్వాసం. ఏ అభిషేకం చేసినా, ఫలితం దక్కాలంటే మనలో నిష్కల్మషమైన భక్తి ఉండాలి.