News August 23, 2025
భారత్‌లో జపాన్ రూ.5.9 లక్షల కోట్ల పెట్టుబడులు!

భారత్‌లో జపాన్ పదేళ్లలో రూ.5.9 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుందని అక్కడి మీడియా పేర్కొంది. PM మోదీ <<17487530>>జపాన్<<>> పర్యటనలో ఈ విషయాన్ని వెల్లడిస్తారని తెలిపింది. మూడేళ్ల క్రితం అప్పటి PM ఫ్యుమియో కిషిడా చెప్పిన 5 ట్రిలియన్ యెన్ ఇన్వెస్ట్ ప్లాన్‌కి కొనసాగింపని చెప్పింది. సెమీ కండక్టర్స్, క్లీన్ ఎనర్జీ, AI, ఫార్మాస్యుటికల్స్ వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేసినట్లు సమాచారం.
Similar News
News January 24, 2026
IRELలో 30 పోస్టులకు నోటిఫికేషన్

కేరళలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (<
News January 24, 2026
రథసప్తమి నాడు అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే..?

సూర్యునికి అత్యంత ప్రీతిపాత్రమైనది అర్ఘ్యం. రథసప్తమి నాడు రాగి పాత్రలోని శుద్ధ జలంలో ఎర్ర పూలు, రక్తచందనం, అక్షతలు కలిపి సూర్యునికి నమస్కరించాలి. శివపురాణంలోని మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. ఆవు పాల క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల సూర్యుడు ప్రసన్నుడవుతాడని నమ్మకం. ఇలా అర్ఘ్య ప్రదానం చేస్తే ఆయురారోగ్యాలు, కంటి చూపు మెరుగుపడి విశేష తేజస్సు లభిస్తుందని మన శాస్త్రం చెబుతోంది.
News January 24, 2026
అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.


